Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కార్మికులకు ఈ ఏడాది సంస్థ ఆర్జించిన లాభాల్లో 29శాతం వాటా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. గతేడాది కంటే ఒక శాతం పెంచుతూ కార్మికులకు సీఎం దసరా కానుక అందించారని ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ తెలిపారు. దసరా కన్నా ముందే కార్మికులకు సొమ్ము చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షన సింగరేణిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొగ్గు తవ్వకంతో పాటు ఇసుక, ఇనుము, సున్నపు రాయి తదిత ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్ రావు, దివాకర్ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి, హరిప్రియ నాయక్, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.