Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాహిత దారుణ హత్య
- నిజామాబాద్ జిల్లాలో అమానుషం
నవతెలంగాణ-మాక్లూర్
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వివాహితను హత్య చేసి పెట్రోల్ పోసి తగులపెట్టిన ఘటన మాక్లూర్ గ్రామ శివారులో మంగళవారం వెలుగుజూసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి ఎస్ఐ రాజారెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు చేరుకొని పంచనామా నిర్వహించారు. అనంతరం క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలూ లభించలేవు. ఎస్ఐ మాట్లాడుతూ.. గుర్తు తెలియని మహిళ (25-30 ఏండ్లు)ను ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని మాక్లూర్ గ్రామ శివారులో పెట్రోల్ పోసి దహనం చేశారని భావిస్తున్నట్టు తెలిపారు. రెండు కాళ్లు కాలకపోవడంతో మహిళ వివాహిత అని తేలిందనీ, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.