Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కోర్టుధిక్కార కేసులో రెండు నెలల జైలు శిక్ష, రూ 2 వేల చొప్పున జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సత్యనారాయణ స్టేషన్‌హౌస్ ఆఫీసర్ నర్సింహులు సవాల్ చేసి డివిజన్ బెంచ్‌లో ఊరట పొందారు. సింగిల్ జడ్జి విధించిన రెండు నెలల జైలు శిక్ష అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. భూసేకరణ చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు స్వాధీనం చేసుకున్నారంటూ చింతలమానేపల్లికి చెందిన రైతు సైదాబాయి, రైతు రేణుబాయి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. తమ భూమిలో పోలీస్ స్టేషన్ కూడా నిర్మించారని తెలిపారు. ఈ కేసులో అధికారులు కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని సైదాబాయి, రేణుబాయిలు కోర్టుధిక్కార కేసు దాఖలు చే స్తే వారికి జైలు శిక్ష విధించింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆర్డీవో,తాహసీల్దారు ఇదే డివిజన్ బెంచ్ నుంచి ఇటీవల మధ్యంతర స్టే ఉత్తర్వులు పొందారు.
తీన్మార్ మల్లన్న ఒకే తరహా కేసులా?: తప్పుపట్టిన హైకోర్టు
తీన్మార్ మల్లన్నపై వేరు వేరు పోలీస్స్టేషన్లలో ఒకే తరహా కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఒకే తరహా కేసులు ఒకేసారి నమోదు చేసి, మిగిలిన కేసులను వాంగ్మూలంగా పరిగణించాలని న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ సోమవారం తీర్పు చెప్పారు. రకరకాల కేసుల పేరుతో మల్లన్నను వేధించరాదని చెప్పింది మల్లన్న భార్య మాతమ్మ దాఖలు చేసిన కేసులో ఈ ఉత్తర్వులను వివరిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.
జస్టిస్ రామచంద్రరావు పంజబ్ హైకోర్టుకు బదిలీ
హైకోర్టు న్యాయమూర్తి, ప్రస్తుత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు పంజాబ్ హర్యానా హైకోర్టుకు బదిలీ అయ్యారు. ముంబైలో పనిచేసే న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల భూయానును తెలంగాణ హైకోర్టు బదిలీ చేశారు. ఏపీ హైకోర్టుకు ఇద్దర న్యాయమూర్తులు నియమించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంగళవారం గెజిట్ విడుదల చేసింది.