Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో 2021-22 విద్యాసంవ త్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడతలో సీట్లను పొందిన విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో సీటును నిర్ధారించుకునే గడువును గురువారం వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర తేదీల్లో ఎలాంటి మార్పు లేదని వివరించారు.