Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ బీడీ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్‌కు సీఐటీయూ నోటీసు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న జరిగే సమ్మెలో పాల్గొనబోతున్నట్టు తెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీరమ, ఉపాధ్యక్షులు నూర్జహాన్ ప్రకటించారు. ఈ మేరకు వారు నిజామాబాద్‌లో తెలంగాణ బీడీ మ్యాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్‌కు సమ్మె నోటీసు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీడీ పరిశ్రమలో పని చేస్తున్న అన్ని కేటగిరీ కార్మికులకు కనీస వేతనాల జిఓ.నెం41ని 2012 ఫిబ్రవరి 3న ఇచ్చారనీ, ఆ జిఓను అబియాన్స్లో పెడుతూ మరో జిఓ 81ని ఇచ్చారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కోప్టా యాక్ట్-2003ని సవరణను ఉపసంహరించుకోవాలనీ, బీడీ పరిశ్రమలోని అన్ని తరగతుల కార్మికులకు కనీస వేతనాల జీఓను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.21 వేలు నిర్ణయించాలని కోరారు. నెలకు 26 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు.