Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాయకులు, కార్యకర్తలకు అభినందనలు
- అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పోడు భూములపై నిర్వహించిన రోడ్ల దిగ్భంధనం కార్యక్రమం జయప్రదమైందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం తెలిపింది. తెగబడి పోరాటంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, పేదలకు ఆ సంఘం అభినందనలు తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ.విజయరాఘవన్, బి వెంకట్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు.సమస్యను పరిష్కరించి పట్టాలు ఇవ్వాల్సిన టీఆర్ఎస్ సర్కారు అక్రమ అరెస్టులు చేయించిందని పేర్కొన్నారు. ఖండించారు.అటవీ చట్టాలను కేంద్రంలో బీజేపీ గిరిజనులకు వ్యతిరేకం గా అటవీ హక్కులను నిర్వీర్యం చేస్తుంటే సీఎం కేసీఆర్ ప్రశ్నించటం లేదని విమర్శించారు.