Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలిలో అలుగుబెల్లి పిటీషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్-యుటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు అదర్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ఈ మేరకు శాసనమండలిలో మంగళవారం చైర్మెన్ ద్వారా సీఎం కేసీఆర్కు పిటిషన్ సమర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కలిగి, అదర్ డ్యూటీ సౌకర్యం పొందిన ఉపాధ్యాయ సంఘాల్లో యూటీఎఫ్ కూడా ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆదేశాలతో 2014 సంవత్సరం జూన్ రెండో తేదీ నుంచి 2018 డిసెంబర్ 31 వరకు ఈ సౌకర్యం కొనసాగించారనీ, 2019, 2020 సంవత్సరాల్లో ఉపాధ్యాయ సంఘాలకు అదర్ డ్యూటీ సౌకర్యం కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేదని గుర్తుచేశారు. అయితే 2021లో పీఆర్టీయు, టిఎస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు మాత్రమే ఈసౌకర్యం కల్పిస్తూ జీవో 591 విడుదల చేశారని చెప్పారు.
టిఎస్యుటీఎఫ్ కూడా రాష్ట్రంలో ప్రముఖ ఉపాధ్యాయ సంఘంగా ఉందనీ, విద్యారంగం అభివృద్ధికీ, ఉపాధ్యాయుల సంక్షేమానికి దోహదపడే విధంగా ప్రభుత్వానికి ప్రాతినిథ్యం వహిస్తూ, ఉపాధ్యాయుల్లో పని సంస్కృతిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. నిర్ణీత గడువులోగా మహసభలు జరిపి నూతన కమిటీలను ఎన్నుకుని ఆ సమాచారాన్ని జీఏడీకి సకాలంలో అందజేస్తున్నారని, ఆ ప్రకారంగా 2021 అదర్ డ్యూటీ కొనసాగింపు ప్రతిపాదనలను సీఎం కార్యాలయానికి పంపారని పేర్కొన్నారు.
ఎఫ్ఆర్ఏ అమలుకు రెండో రోడ్ మ్యాప్ ప్రకటించాలి
2006లో గిరిజన తెగల అటవీ హక్కుల గుర్తింపు కోసం వచ్చిన చట్టం అమలుకు రెండో రోడ్ మ్యాప్ ప్రకటించాలని నర్సిరెడ్డి కోరారు. ఈ మేరకు మండలిలో ప్రత్యేక ప్రస్తావన చేశారు. ఆ చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 కంటే ముందు సాగులో ఉన్న పోడు సాగుదారులందరికీ గ్రామ సభ ఎంపిక ఆధారంగా హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉందన్నారు.