Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వస్తు సేవల పన్ను చట్టం-2017 సవరణ బిల్లు, తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించు పర్యాటకులు, ప్రయాణికులకు సంబంధించి దళారీతనం, దుష్ప్రవర్తన చేయడం వంటి చర్యలను నివారించే బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. మంగళవారం వస్తు సేవల పన్ను చట్టం-2017 సవరణ బిల్లును మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించు పర్యాటకులు, ప్రయాణికులకు సంబంధించి దళారీతనం, దుష్ప్రవర్తన చేయడం వంటి చర్యలను నివారించే బిల్లును హోంమంత్రి మహమూద్ అలీ ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులు ఆమోదం పొందాయని ప్రొటెం చైర్మెన్ భూపాల్‌రెడ్డి చెప్పారు. అనంతరం గురువారం ఉదయం 10 గంటలకు మండలిని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.