Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు
నవతెలంగాణ-కాజీపేట
కేంద్ర ప్రభుత్వం రైల్వేలో ప్రవేశపెడుతున్న ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు కార్మికులు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (ఏఐఎల్ఆర్ఎస్) దక్షిణ మధ్య రైల్వే జోన్ అధ్యక్షులు సత్యనారాయణ పిలుపునిచ్చారు. కాజీపేటలోని రైల్వే కమ్యూనిటీ హాల్లో అసోసియేషన్ స్థానిక బ్రాంచ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. రైలు డ్రైవర్లు పలు కారణాలతో రెడ్ సిగల్ దాట డంతో ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి ఉందని ఆందోళన వెలిబు చ్చారు. వారందరినీ వెంటనే తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాం డ్ చేశారు. కార్మికుల పోరాటాల ఫలితంగా రన్నింగ్ స్టాఫ్‌కే కాకుండా అన్ని శాఖల కార్మికులకు ఏడో పీఆర్సీ లభిస్తోందని చెప్పారు. రైల్వే శాఖ రోజుకో సర్క్యూలర్‌ను విడుదల చేసి కార్మికులపై పని భారాన్ని మోపుతోందని విమర్శించారు. క్రమశిక్షణ పేరుతో రైల్వే కార్మికులను వేధించడం సరికాదన్నారు. గూడ్స్ రైలు డ్రైవర్లకు కిలోమీటర్ల కోత వల్ల మూల వేతనంలో భారీగా నష్టం వాటిల్లుతోందని ఆందోళన వెలిబు చ్చారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ జోనల్ కార్యదర్శి గురుమూర్తి, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీవీఎస్ఎస్ మూర్తి, వైఎస్‌కే రావు, కోశాధికారి కేవీఎస్ రావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జి ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.