Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఆర్డీ మహిళా విభాగం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళా వికలాంగుల్లో చైతన్యం నింపేందుకు బుధవారం నుంచి ఈనెల 14 వరకు వికలాంగుల బతుకమ్మ ఆట- పాట ఉత్సవాలను జరుపుకోవాలని ఎన్పీఆర్డీ మహిళా విభాగం రాష్ట్ర కో కన్వీనర్ కె నాగలక్ష్మి, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ సభ్యురాలు కె శశికళ మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని కార్యాలయంలో మంగళవారం బతుకమ్మ ఉత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ ప్రజల సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ముగింపు ఉత్సవాలను అక్టోబర్ 11న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య, గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ నాయకులు లావణ్య తదితరులు పాల్గొన్నారు.