Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందిరాగాంధీ విగ్రహాం వద్ద కాంగ్రెస్ నిరసన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతుల చావుకు కారణకులైన కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్‌ను చేయాలని టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కొవ్వొత్తులు వెలిగించి రైతులకు సంతాపం తెలిపారు. మోడీ హఠావో, దేశ్‌కు బచావో, బీజేపీ, మోడీ, అమిత్ షా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రహౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను బర్తరఫ్ చేయాలనీ, రైతులపై కర్కశంగా కారు ఎక్కించి హత్య యత్నం చేసిన ఆయన కొడుకుతోపాటు బీజేపీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేక ఆందోళనలో 450 మంది రైతులు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను నాశనం చేసిన పాలకులు...రాజకీయంగా ఎనాడూ బాగుపడలేదని విమర్శించారు. చనిపోయిన రైతుల కుటుంబాల పక్షాన దేశమంతా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ తరుపున ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థికసాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, నాయకులు షబ్బీర్ అలీ, సంపత్, మహేష్ కుమార్ గౌడ్, దాసోజు శ్రవణ్, నాయకులు హర్కర వేణుగోపాల్, వినోద్‌రెడ్డి, జగదీశ్వర్, సుధీర్ రెడ్డి, వీహెచ్, ఫిరోజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
త్వరగా కోలుకోవాలి అంజన్‌కుమార్‌కు సోనియా లేఖ
అనారోగ్యంతో బాధపడుతున్న టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ త్వరగా కోలుకోవాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆకాంక్షించారు. ఈమేరకు మంగళ వారం ఆయనకు లేఖ రాశారు. అంజన్ కుమార్ యాదవ్ కోవిడ్‌తో బాధపడుతూ ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం బాగుపడాలని సోనియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.