Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశ్రమలకు ప్రోత్సహకాల్లేవ్.. మొత్తం రుణాలే : మండలిలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల ఆర్థిక ప్యాకేజీ అనేది మిథ్య అని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు విమర్శించారు. మంగళవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో పారిశ్రామిక రంగంపై కరోనా మహమ్మారి ప్రభావానికి సంబంధించి అధికార పార్టీ సభ్యుడు భానుప్రసాద్ రావు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, కేంద్ర ప్యాకేజీ కేవలం పెద్ద పరిశ్రమలకే లాభం చేకూర్చేదిగా ఉంది. సూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉపయోగం లేదని తెలిపారు. ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రిని కలిసి స్వయంగా చెప్పాననీ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రికి లేఖ రాసి సహకరించాలని కోరినట్టు గుర్తుచేశారు. అయితే తాను చేసిన సూచనపై కేంద్రం నుంచి కనీస స్పందన కరువైం దన్నారు.
కనీసం లేఖ అందిందనే సమాచారం కూడా ఇవ్వలేదని తప్పు పట్టారు. ప్యాకేజీపై కేంద్రం చేసిన గంభీర ప్రకటనను తమ శాఖ అధ్యయనం చేసిందనీ, అందులో ప్రోత్సాహకాలే లేవనీ, మొత్తం రుణాలేనని తెలిపారు. ఆ రుణ వితరణలో కూడా రూ.20 లక్షలకు గాను రాష్ట్రంలో ఎంఎస్ఎంఇలకు కేవలం 1,43,290 యూనిట్లకు రూ.5,389 కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పారు. వాటిని కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు.