Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు నెలలుగా జీతాలు పెండింగ్
- కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు రెండు నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (జీసీసీఎల్ఏ-475) తెలిపింది. దసరా పండుగ జరుపుకోవద్దా?అని ప్రశ్నించింది. ఈ మేరకు సంఘం అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టు అధ్యాపకులకు ఆగస్టు, సెప్టెంబర్ జీతాలు చెల్లించలేదని తెలిపారు. నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే జూన్, జులై నెలల జీతాల బడ్జెట్ను విడుదల చేసిందని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను టీడీఎస్ 10 శాతం సమస్య వల్ల అవీ అధ్యాపకుల ఖాతాల్లో జమ కాలేదని వివరించారు. దసరా పండుగ వస్తున్నదనీ, ఈలోపే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.