Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్యూ కార్యవర్గం డిమాండ్ చేసింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మామిడికాయల పరశురాం, ఇడంపాక విజరుఖన్నా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండేండ్లుగా విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. దీని వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడకుండా ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయాలనీ, లేనిపక్షంలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.