Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కనీస వేతనాల జీవోలను విడుదల చేయాలనీ, లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీఐటీయూ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మెకు తెలంగాణ రైతుసంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. బుధవారం హైదరాబాద్లోని రైతు సంఘం కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు విలేకర్లతో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ, కార్మికుల వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యూటీీ, పెన్షన్ల వంటి సౌకర్యాలను అమలు కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, కార్మిలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఆర్ అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.