Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో బ్యూరో - హైదరాబాద్
పన్నెండో తరగతి చదుతున్న విద్యార్థులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1.5 లక్షలు విరాళాన్ని అందజేశారు. వర్షిత్ నర్రా, చరిత రెడ్డి, సుధీష్ రెడ్డి, శరత్ రెడ్డి తదితరులు ఛారిటీ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించి నిధులను సేకరించారు. బుధవారం ఆ నలుగురు విద్యార్థులు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను కలిసి చెక్కును అందజేశారు. యువకుల సామాజిక బాధ్యతను మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, భవిష్యత్తులో ప్రభుత్వానికి అంబులెన్సు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు.