Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్లుగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలను కేంద్రం గుర్తించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ కృషి ఉందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోఢ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వారిని ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించినందుకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీకి కృతజ్ణతలు తెలిపారు.