Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో కట్టడాలు పూర్తి చేసిన రెండు పడకల ఇండ్లను లబ్ధిదారుల కేటాయింపునకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలంటూ బీజేపీ నేత ఎన్ ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. సుమారు మూడు లక్షల ఇండ్ల మంజూరు లక్ష్యంలో 63 వేలే కట్టారనీ, 12,656 ఇండ్లు మాత్రమే లబ్ధిదారులకు కేటాయించారని సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వం తెలిపిందన్నారు. 1.27 లక్షల ఇండ్లు నిర్మాణాల్లో ఉన్నాయన్నారు. నిర్మాణాలు పూర్తయిన ఇండ్లు ఖాళీగా ఉండటంతో దెబ్బతింటున్నాయనీ, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయనీ, కరెంటు, తలుపులు, కిటికీలను దొంగలు పట్టుకుపోతున్నారనీ, అందువల్ల నిర్మాణాలు పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటీషన్లో కోరారు. భారీ మొత్తంలో ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మిస్తున్నారనీ, దీనిలో కేంద్ర వాటా కూడా ఉందన్నారు. పిల్లో ప్రతివాదులుగా చీఫ్ సెక్రటరీ, గహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి, గహ నిర్మాణ సంస్థ, 33 జిల్లాల కలెక్టర్లను చేశారు.