Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ ఎమ్డీ సజ్జనార్, చైర్మెన్ బాజిరెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మంథని సమీపంలో కారు డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం వల్ల ఆర్టీసీ బస్సును ఢకొీట్టిన ఘటన దురదృష్టకరమని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. బస్సు డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణీకులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని తెలిపారు. కారుడ్రైవర్పై కేసు నమోదైందనీ, ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి, గాయపడిన వారికి వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.