Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు కోదండరాం సవాల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు రావాలని సీఎం కేసీఆర్కు టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సవాల్ విసిరారు. పెత్తరమాస సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర బుధవారం తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన అమరవీరులకు టీజేఎస్ పార్టీ ఆధ్వర్యంలో బియ్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు వల్లె వేశారని విమర్శించారు. ఇప్పటి వరకు భర్తీ చేసినవి కేవలం 77 వేల ఉద్యోగాలేనని అన్నారు. రాష్ట్రంలో ఇంకా 2.80 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా నిరుద్యోగులను ఆదుకోవడంలోనూ టీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పీ.ఎల్.విశ్వేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.