Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్సు బోల్తా.. 13 మందికి గాయాలు
- కారు డ్రైవర్ మృతి
నవతెలంగాణ - మంథని
ఆర్టీసీ బస్సు, కారు ఢకొీన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. బస్సు బోల్తా పడటంతో 13మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బెల్లపల్లి నుంచి హనుమకొండకు ప్రయాణికులతో బయలుదేరింది. మంథని మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామ శివారులో ప్రదాన రహదారిపై ఎదురుగా వస్తున్న కారును ఢకొీట్టింది. ప్రమాదంలో కారు నుజ్జు కాగా.. డ్రైవర్ తాటి వినీత్(21) అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సు రోడ్డు పక్కన గల చిన్న లోయలో బోల్తాపడింది. దాంతో 13మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని మంథని పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఓ వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మంథని మండలంలోని కాన్సాయిపేట్ గ్రామానికి చెందిన వినీత్ మండల కేంద్రంలోని కార్ కేర్ సెంటర్లో మెకానిక్‌గా పని చేసేవాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.