Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-జహీరాబాద్
ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం సజ్జారావు పేట తండాలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన చిన్నారులు శ్రీనాథ్ (9),అరవింద్ (11)బుధవారం ఆడుకో వడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు. చిన్నారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.