Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైర్ ఎన్వోసీ నుంచి మినహాయింపు
- ఈ ఏడాదికే వర్తిస్తుందని హోం శాఖ ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గుర్తింపు లేకుండానే కొనసాగుతున్న ప్రయివేటు జూనియర్ కాలేజీలకు ఊరట లభించింది. మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్న ఆ కాలేజీలకు ఫైర్ ఎన్వోసీ నుంచి ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ ఏడాది వరకే ఈ మినహాయింపు వర్తిస్తుందని స్పష్టం చేశారు. జీవో నెంబర్ 29లోని పారా 4(3)ని నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్న ప్రయివేటు జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అన్ని రకాల పరికరాలను ఏర్పాటు చేయాలనీ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తాము చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం జీవోనెంబర్ 95 విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) అధ్యక్షులు గౌరి సతీష్‌కి ధన్యవాదాలు తెలిపారు.