Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుజూరాబాద్‌కు భారీగా తరలివచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు
- పోలీసులు అడ్డుకోవడంతో నామినేషన్ పత్రాలతో నిరసన
నవతెలంగాణ - హుజూరాబాద్
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమై నామినేషన్ వేసేందుకు భారీగా తరలివస్తున్న ఉపాధిహామీ చట్టం ఫీల్డ్ అసిస్టెంట్లను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. తమ ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని డిమాం డ్ చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్న విషయం విదితమే. తమ నామినేషన్ పత్రాలతో రిటర్నింగ్ అధికారిని కలిసేందుకు రాగా కొవిడ్ నిబంధనల పేరుతో పోలీసులు అడ్డుకుంటున్నారు. బుధవారం 24 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్దకు పోనివ్వ లేదు. సరికాదా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని వారిని అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. గురువారం సైతం సుమారు 50 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్ వేసేందుకు వచ్చారు. అయినప్పటికీ వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తమ పత్రాలతో పట్టణంలో ఆందోళనకు దిగారు. తమ నామినేషన్ పత్రాలు స్వీకరించాలని డిమాండ్ చేశారు.