Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో తొలిసారిగా మహిళా మోటారు ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గురువారం సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యదేవరాజన్తో కలిసి ఆమె ఆ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదని చెప్పారు. మోవో సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఆ సంస్థ అధ్యక్షురాలు జైభారతికి ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు. చేసే పనిలో నిబద్ధత ఉంటే తాము ఎవరికీ తక్కువ కాదని మహిళలు నిరూపిస్తున్నారని వివరించారు. గతంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ అంటే పోషకాహారాన్ని అందించడానికే పరిమితమైందనీ, నేడు దాని పరిధి విస్తరించి అనేక కార్యక్రమాలను చేపడుతున్నదని వివరించారు. అంగన్వాడీలు గ్రామాల్లో సోషల్ పోలీసులు పని చేస్తున్నారని చెప్పారు.షీ - క్యాబ్స్ వల్ల, డ్రైవింగ్ నేర్పడం, నేర్చుకోవడం ద్వారా మహిళల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. టాక్సీలలో మహిళా డ్రైవర్ ఉంటే మహిళలు ఆ టాక్సీ ఎక్కడానికి కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని తెలిపారు.