Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాలకు అవకాశం ఎందుకివ్వరు?
- కేంద్రానికి మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సూటి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీసీ జనగణనను ఎందుకు చేపట్టటం లేదనీ, కనీసం రాష్ట్రాలు గణన చేపట్టేందుకు కూడా ఎందుకు అనుమతించటం లేదని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని అసెంబ్లీ మీడియా పాయింట్ లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 70 కోట్ల మంది ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయలేదనీ, బడ్జెట్ లో కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించారని విమర్శించారు. బీసీ తరగతికి చెందిన వ్యక్తి ప్రధానిగా ఉండి కూడా గణన చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీ జనాభాపై ప్రభుత్వం వద్ద సరైన లెక్కలున్నాయనీ, అందువల్లే సమర్థవంతంగా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నామని చెప్పారు. బీసీ గణన కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని బీసీ సంఘాలకు సూచించారు. షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కులాల వారిగా జనాభా లెక్కలు అవసరమని అభిప్రాయపడ్డారు.