Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీరో అవర్‌లో ఎమ్మెల్యేల మొర
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో అన్ని అనుమతులు ఉన్నా రిజిస్ట్రేషన్లు చేయడం లేదంటూ ఎల్.బి నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో గురువారం ప్రశ్నోత్తరాల అనంతరం జీరో అవర్‌లో పలువురు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. తొలుత ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ 1980లో పర్మిషన్లు ఇవ్వడంతో ఇండ్లు కట్టుకున్నారనీ, కాగా ఇప్పటికీ ఇండ్లు రిజిస్ట్రేషన్లు చేయడం లేదని తెలిపారు. అప్పట్లో హడా సైతం అనుమతులు సైతం ఇచ్చిందన్నారు. 1996లో ఓఆర్సీ రద్దు చేసి, 2008లో రిజిస్ట్రేషన్లు ఆపేశారన్నారు. ఇది వందలాది కాలనీలకు సంబంధించిన సమస్య అని చెప్పారు. ఈ సమస్యపై సీఎం, మంత్రి కేటీఆర్ స్పందించాలని కోరగా, సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళతామని కేటీఆర్ హామీనిచ్చారు. సామాజిక అణచివేత అనంతరం రిజర్వేషన్లు వచ్చాయనీ, ఇప్పుడు వాటి శాతాన్ని పెంచాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఎస్సీలకు 16 శాతం, ఎస్సీలకు ఆరు శాతం రిజర్వేషన్లు అమలుచేస్తున్నారని చెప్పారు. వాటిని పెంచాలన్నారు. హైదరాబాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసుల బాధ తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే జాఫర్ హస్సేన్ అన్నారు. ఇష్టారాజ్యంగా చలానాలు వేస్తూ ప్రయాణీకులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఆస్పత్రులకు వెళ్లేవారిని అనవసరంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
50 శాతం ఫోన్లు ఈసమస్యతోనే వస్తున్నాయని అన్నారు. ఎజెన్సీ ప్రాంతాల్లో మరిన్ని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలిపారు. ఆశావర్కర్లు, సెకండ్ ఏఎన్ఎంల సర్వీసు సమస్యలూ పరిష్కరించాలని సూచించారు. 365ఏ జాతీయ రహదారి పూర్తిగా గుంతలమయంగా మారిందనీ, వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పోలీసుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. 1992 నుంచి కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు ఇవ్వడం లేదన్నారు. గ్రానైట్ పరిశ్రమలో బరువు ఆధారంగా పన్ను వేయరాదని ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కోరారు. దీనిమూలంగా ఆ పరిశ్రమ మూతపడే అవకాశం ఉందన్నారు. ఉర్దూ భాషను రక్షించాలని ఎమ్మెల్యే పాషాఖాద్రీ ప్రభుత్వాన్ని కోరారు. వీరితోపాటు ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, రఘనందన్‌రావు, రవీంద్రనాయక్ తమ నియోజకవర్గ సమస్యలను జీరో అవర్‌లో ప్రస్తావించి సర్కారు దృష్టికి తీసుకెళ్లారు.