Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
- జాతీయ ఎస్సీ కమిషన్‌కు బక్క జడ్సన్ ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఆయా వర్గాలకు దక్కకుండా సీఎం కేసీఆర్ దారి మళ్లించారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ పేర్కొన్నారు. అందువల్ల కేసీఆర్‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. ఈమేరకు గురువారం జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఆయన లేఖ రాశారు. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ దళిత, గిరిజనులను మోసం చేశారనీ, నేడు దళిత సాధికారత పేరుతో మరోసారి వంచించేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. దళితుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన ప్రత్యేక నిధులను కల్యాణలక్ష్మి, నూతన రెసిడెన్షియల్ పాఠశాలు, మహిళా డిగ్రీ కళాశాలు, ఆసరాపింఛన్లు, తాగునీరు, కేసీఆర్కిట్లు, రైతు బంధుకు మళ్లించారని తెలిపారు. ఈ సంవత్సరం కూడా రూ. 7,500 కోట్లను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పూడిక తీత కార్యక్రమాలకు ఖర్చు చేశారని వివరించారు. దళితులకు మంత్రి పదవులు ఇవ్వకుండా, అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కుంటే సాధికారత ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దళిత, గిరిజనులపై లైంగికదాడులు, దాడులు, హత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జగ్గారెడ్డి, జడ్సన్‌పై కేసుకొట్టివేత
కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రలకు వ్యతిరేకిస్తూ గతేడాది రాజభవన్ ముట్టడిలో పాల్గొన నేతలపై పెట్టిన కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఆ కేసులకు ఆధారాలు లేవని పేర్కొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్, నాయకులు ఉపేందర్‌రెడ్డి, కందుకూరి హర్షవర్ధన్‌పై పంజాగుట్ట పోలీసులు అప్పట్లో పలు కేసులు నమోదు చేశారు. గురువారం ఈమేరకు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టి ఆ కేసులను కొట్టివేసింది.