Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫసల్‌బీమాతో కంపెనీలకే లాభం : మంత్రి సి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందనీ, అంతర్జాతీయ మార్కెట్లో మన పత్తికి మంచి డిమాండ్ వస్తున్నదని మంత్రి సి. నిరంజన్ రెడ్డి అన్నారు. పత్తిసాగు విస్తీర్ణంలో దేశంలో రెండో స్థానంలో ఉన్నామని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో పత్తిలో తేమ శాతం, వర్షాలతో పంటనష్టంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బీజేపీ సభ్యులు రఘునందన్‌రావు, టీఆర్ఎస్ సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, అబ్రహం, బాపూరావు రాథోడ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో 376 జిన్నింగ్ మిల్లులున్నాయనీ, మరో 20,25 ప్రారంభానికి సిద్ధమయ్యాయని చెప్పారు. వాస్తవ సగటు నాణ్యత(ఎఫ్ఏక్యూ) నిర్వహణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పత్తి సాగులో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా..ఉత్పత్తిలో మన రాష్ట్రం తొలిస్థానంలో ఉందని వివరించారు. పత్తికి కనీస మద్దతు ధరను సీసీఐ రూ.6025గా నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్రంలో ఈసారి పత్తి సేకరణ లక్ష్యం 33.20 లక్షల మెట్రిక్ టన్నులని చెప్పారు.