Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలిలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మున్సిపల్ , పంచాయతీరాజ్ చట్టాలను తీసుకరావడం, స్థానిక సంస్థలకు తగినన్నీ నిధులు కేటాయించడంతో పట్టణాలు, గ్రామాల్లో మార్పు మొదలైందని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. శుక్రవారం శాసనమండలిలో పట్టణ ప్రగతిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. సమ్మిళిత అభివద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సమానంగా అభివద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. పట్టణాలు ఆర్థికాభివద్ధికి చోదకశక్తులుగా మారాయని చెప్పారు. రాష్ట్ర భూభాగంలో 3 శాతంలోనే 50 శాతం జనాభా ఉందనీ, రాష్ట్ర జనాభా దాదాపు సగం మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారని వివరించారు. పట్టణాల అభివద్ధిలో భాగంగా నాలుగు కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. యువత, మహిళా, సీనియర్ సిటిజన్లు, కమ్యూనిటీవర్గాలో వేసిన కమిటీల్లో దాదాపు 2 లక్షల మంది సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణానికి సెల్ఫ్ ఎసెస్మెంట్ విధానం తీసుకొచ్చామనీ, 75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరం లేదని పునరుద్ఘాటించారు.
ఆశించిన ఫలితాలు వస్తున్నాయి పల్లెప్రగతిపై మంత్రి ఎర్రబెల్లి
దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని ఆనాడు గాంధీ చెప్పిన కలలు నిజమవుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తలపెట్టిన లక్ష్యం నెరవేరుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. శుక్రవారం శాసనమండలిలో పల్లెప్రగతిపై చర్చలో ఆయన మాట్లాడారు. పంచాయతీలకు నిధులు,విధులు సకాలంలో విడుదల చేయడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నదని చెప్పారు. వాటిని అభివృద్ధిని చూసి, ఇతర ప్రాంతాలకు వలసపోయిన వారు సైతం ఆయా గ్రామాలకు తిరిగొచ్చి ఇండ్లు కట్టుకుంటున్నారని వివరించారు.