Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పిటిషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వెదురు చేతి వృత్తిదారులైన మేదరుల సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ఈ మేరకు శాసనమండలిలో శుక్రవారం ఆయన ఒక పిటిషన్ను సమర్పించారు. ఈ వత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఏడాదికి 3,600 వెదురు బొంగుల చొప్పున ఉచితంగా సరఫరా చేయాలనీ, గతంలో సరఫరా చేసిన వెదురు బొంగుల బకాయిలను రద్దు చేయాలని పేర్కొన్నారు. యువతకు శిక్షణా తరగతులు క్రమబద్ధంగా నిర్వహించాలనీ, వీరికి రూ.ఒక లక్ష ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఉర్దూ మీడియం కొనసాగించాలి
మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో నాలుగు బాలికలకు, మరో నాలుగు బాలురతో పాటు రెండు మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఉర్దూ మీడియాన్ని కొనసాగించాలని నర్సిరెడ్డి కోరారు. మండలిలో ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక ప్రస్తావన తెచ్చారు. అదే విధంగా ఉర్దూ మీడియం ఉపాధ్యాయ రిజర్వ్డ్ పోస్టులను డీ-రిజర్వ్ చేసి, 2017 టిఆర్టి అభ్యర్థులతో భర్తీ చేయాలని సూచించారు.
పెరుగుతున్న ధరలపై చర్చించేందుకు తిరస్కరణ
రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాసు ధరలపై చర్చించాలంటూ అలుగుబెల్లి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ప్రొటెం చైర్మెన్ తిరస్కరించారు.