Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనులు ,పేదలకు హక్కు పత్రాలనిచ్చే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్నామంటూ అసెంబ్లీ లో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.పోడు సాగు దారులకు ఆర్.ఓ.యఫ్.ఆర్ చట్టం ప్రకారం హక్కులు కల్పించేందుకు కార్యాచరణ రూపొందించాలనీ లేకపోతే మరో ఉద్యమం తప్పదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుయం .ధర్మ నాయక్,ఆర్.శ్రీరామ్ నాయక్ హెచ్చరించారు. సీఎం రాజకీయ లబ్ధి కోసమే ఎమ్మెల్యేల ద్వారా హక్కులు కల్పిస్తామంటూ ప్రకటించటం సరికాదని పేర్కొన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి రాజకీయ జోక్యం వల్లనే లక్షలాదిమంది గిరిజనులు,పేదలకు హక్కులివ్వకుండా నిరాకరించబడ్డారని గుర్తుచేశారు.చట్టంలో పేర్కొన్న విధంగా గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజె న్సీగా అటవీశాఖ,రెవెన్యూ శాఖలతో చట్టాన్ని అమలు చేయాలని కోరారు.