Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పవన విద్యుత్ వైపు దృష్టిపెట్టలేం:మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో టీఎస్ఈఆర్సీ నోటిఫై చేసిన విధంగా నెట్ మీటరింగ్ రెగ్యులేషన్ల ప్రకారం సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం శాసన సభలో సభ్యులు గాదరి కిషోర్‌కుమార్, కె.మహేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి వివరణిచ్చారు. సోలార్ విద్యుత్ గృహవినియోగదారులకు 3కిలోవాట్లకు 40 శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. పవన విద్యుత్ తయారీకి మన దగ్గర తక్కువ అవకాశాలున్నాయనీ, తయారు చేస్తున్న రాష్ట్రాలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయనే విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. మున్సిపల్ వ్యర్థాల నుంచీ విద్యుత్ తయారు చేస్తున్నామనీ, ఇప్పటికే హైదరాబాద్‌లో 19.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నదని వివరించారు.