Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా నీరు అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఏర్పడిన కేంద్ర నిటిఆయోగ్ మరోసారి ప్రశంసించింది. నిటిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ట్విట్టర్ వేదికగా నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు 'హర్ ఘర్ జల్' వాస్తవ రూపం దాలుస్తున్నది. దేశంలో తెలంగాణ, గోవా తర్వాత గ్రామీణ ప్రాంతాలకు నల్లాల ద్వారా మంచినీటిని అందించే అతి ముఖ్యమైన లక్ష్యాన్ని సాధించిన మూడో రాష్ట్రంగా హరియాణ కూడా అవతరించింది. అది కూడా 'జల్ జీవన్ మిషన్' వేగమైన లక్ష్యానికి ఓ ప్రేరణ గా నిలిచిందంటూ ఆయన ట్వీట్ చేశారు. నీతి ఆయోగ్ రాష్ట్ర మిషన్ భగీరథ పథకాన్ని మరోసారి ప్రశంసించడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మెన్ బి.వినోద్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు.