Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత మాజీ ప్రధాని నరసింహారావు చిత్రపటాన్ని శుక్రవారం అసెంబ్లీ లాబీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్, సీఎం కేసీఆర్, ప్రొటెం చైర్మెన్‌తోపాటు పలువురు పీవీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పీవీ కుమార్తె సురభి వాణీదేవీ, ఆమె కుటుంబసభ్యులు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహ్మచార్యులు పాల్గొన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల విగ్రహ ప్రతిష్టాపన, వివిధ దేశాలలో చేపట్టే కార్యక్రమాలను పీవీ కమిటి చైర్మన్ కె కేశవరావు సీఎంకు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఐదు దేశాలలో పీవీ విగ్రహాలని స్థాపించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహ ఖర్చులు అన్నీ ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు పీవీ జయంతి ఉత్సవాల కమిటీ సభ్యడు మహేష్ బిగాల తదితరులు సీఎం కేసీఆర్, కె కేశవరావుకు ధన్యవాదాలు తెలిపారు.