Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీవత్స నృసింహ పాలపర్తి మోరంపూడి ఫౌండేషన్ దాతృత్వం
నవతెలంగాణ-సిటీబ్యూరో
శ్రీవత్స నృసింహ పాలపర్తి మోరంపూడి ఫౌండేషన్ యాజమాన్యం మానవత్వం చాటుకుంది. వికలాంగులకు నేనున్నానంటూ ముందు వరసలో సేవలందించే ఆ సంస్థ వీఎస్టీ ఆర్టీసీ కళ్యాణమండపం ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తున్న నాగరాజు అనే వికలాంగునికి వీల్‌చైర్‌ను అందజేశారు. నవతెలంగాణ దినపత్రికలో అతని జీవన చిత్రంపై వచ్చిన కథనానికి వీఆర్ రామాచారి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వీఆర్ శ్రీనివాస్ స్పందించి, మోరంపూడి ఫౌండేషన్ సలహాదారు ధనుంజరును సంప్రదించారు. ఆయన నాగరాజు దయనీయతను పాలకుర్తి రమేష్ దృష్టికి తీసుకెళ్లగా అతని అవసరాలకు తగినట్టు డిజైన్ చేసిన రూ.10వేలు విలువగల వీల్‌చైర్‌ను నవతెలంగాణ బ్యూరో రిపోర్టర్ వెంకన్న సమక్షంలో అందచేశారు. ఈ సందర్భంగా ధనుంజరు మాట్లాడుతూ పద్మారావునగర్ సమీపంలో మధురానగర్‌లో శ్రీవత్స నృసింహ పాలపర్తి మోరంపూడి ఫౌండేషన్‌ను 9 సంవత్సరాల క్రితం పాలపర్తి రమేష్ ప్రారంభించారన్నారు. వికలాంగుడనైన తాను ప్రొఫెషనల్ సింగర్‌గా పనిచేస్తున్నట్టు తెలిపారు. వికలాంగులకు వీఆర్ శ్రీనివాస్ జీవనోపాధి చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1993, 1994లో ఆయన డబుల్ ఎంబీఏ పూర్తిచేసి, గోల్డ్‌మెడల్ సాధించారనీ, ఆయన ప్రేరణతో తానూ సేవా కార్యక్రమాల్లో భాగస్వామి అవుతున్నట్టు వివరించారు.