Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు
- రైతు, సీఐటీయూ, వ్యకాస సంఘాల పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేరి రైతు ఉద్యమ అమరవీరులను స్మరిస్తూ ఈ ఆదివారం అన్ని జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ.. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేరిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా తన అనుచరులతో కలిసి రైతులను కారుతో తొక్కించడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ఈ అమానుష ఘటన పట్ల దేశమంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేసిందని తెలిపారు. బాధ్యులపై తక్షణమే హత్య కేసులు నమోదు చేయాలనీ, ఆశిష్ మిశ్రా, బీజేపీ గుండాలను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా ను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, సీఐటీయూ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ అంజనేయులు తదితరులు ఉన్నారు.