Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్వీ నర్సయ్య మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకట నలో తెలిపారు. ప్రముఖ సివిల్ ఇంజనీర్, అభ్యు దయవాది, కమ్యూనిస్టు అభిమాని ఎస్వీ నర్స య్య అనారోగ్యంతో బాధపడుతూ.. బెంగు ళూరులో శుక్రవారం కన్ను మూశారు. ఆయన మరణం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సంతాపం తెలియజేసింది. నర్సయ్య తెలంగాణా సాయుధ పోరాట వివరాలను సేకరించి విజయవాడ ఆఫీసుకు చేర్చేవారని తమ్మినేని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ పోరాటం ముగింపు తర్వాత నర్సయ్య సీపీఐ(ఎం) అభి మానిగా,కమ్యూనిస్టు ఉద్యమానికి తోడ్పాటున ందిం చారని తెలిపారు. హైదరాబాద్ సుంద రయ్య విజ్ఞాన కేంద్రం భవన నిర్మాణంలో ఆయన పాలుపంచుకున్నారనీ, పార్టీ, ప్రజాసంఘాలకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందించేవారని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌కు ఆర్కిటెక్ట్‌గా ఉండి భవన నిర్మాణానికి అన్ని విధాల తోడ్పాటునందిం చారనీ, ఆ తర్వాత ఆయన బెంగుళూరులో స్థిరపడి కమ్యూనిస్టు ఉద్యమానికి సహకరించారని తెలిపారు.పార్టీ అబివృద్ధి కోసం సలహాలు సూచనలు ఇచ్చేవారని వివరిం చారు. నర్సయ్య కుటుంబ సభ్యులకు తమ్మినేని సానుభూతి తెలిపారు.
ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటు : ఎస్వీకే నాయకులు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్టు పూర్వ సభ్యులు ఎస్వీ నర్సయ్య మరణం ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటని ఎస్వీకే మేనేజింగ్ కమిటి కార్యదర్శి ఎస్ వినరుకుమార్ తెలిపారు. వృద్దాప్య సమస్యల వల్ల ఆయన చాలా కాలం నుంచి అస్వస్థులుగా ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం స్థాపనకు ఆయన ఆర్థిక, హార్థిక సహా కారం అందించారని గుర్తుచేశారు. పుచ్చలపల్లి సుందరయ్యతో దగ్గరి సంబంధాలు నెరిపారని ఉండేవారని పేర్కొన్నారు. ఆయన మరణానికి ఎస్వీకే పూర్వ మేనేజింగ్ ట్రస్టీ సి.సాంబిరెడ్డి,వై సిద్దయ్య ప్రగాఢ సంతాపాన్ని ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.