Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు టీపీహెచ్డీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీహెచ్డీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కత్తి జనార్థన్ ఆధ్వర్యంలో నాయకులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎమ్.రిజ్వీ, ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ గంగాధర్, వైద్యారోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాస్ రావు, రాష్ట్ర వైద్యవిద్యసంచాలకులు డాక్టర్కె.రమేశ్ రెడ్డి ని కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
పీజీ సర్వీస్ కోటాను పునరుద్ధరించాలనీ, 2018లో నియామకమైన డాక్టర్లకు, నేషనల్ హెల్త్ మిషన్, బస్తీ దవాఖానాలు, యూపీహెచ్సీ డాక్టర్లకు కూడా కొత్త పీఆర్సీలో 30 శాతం పిట్మెంట్ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రజారోగ్య విభాగంలో క్యాడర్ స్ట్రెంత్ ను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.