Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజేఏస్ అధినేత కోదండరాం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్థంతి రోజైన డిసెంబర్ 3న హైదరాబాదులో వేలాది మందిలో విద్యార్థి, నిరుద్యోగ యువతతో ''తెలంగాణ యూత్ డిమాండ్స్ డే''నునిర్వహిస్తామని టీజేఏస్ అధినేత కోదండరాం ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీంపాష అధ్యకతన యువజన, విద్యార్థి రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకుల సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ..రాష్ట్రంలో ఇంకా 2లక్షల 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకునే అవకాశం ఉన్నా, అందుకనుగుణంగా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని విమర్శించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. ఆత్మస్థైర్యంతో పోరాడాలని కోరారు. ఉద్యోగ, ఉపాధి సాధనకై దసరా తర్వాత జిల్లాల్లో సదస్సులు చేపడతామని తెలిపారు.