Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూర్ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారించాలి
- నేడు కొవ్వొత్తుల ర్యాలీ : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉత్తరప్రదేశ్ లఖింపూర్‌లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలను కారుతో ఢకొీట్టించి నలుగురి చావుకు కారణమైన కేంద్ర మంతి కుమారుణ్ని వెంటనే అరెస్టు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సాయిబాబు, చుక్కరాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమరులైన రైతులను స్మరించుకుంటూ సీఐటీయూ, తెలంగాణ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిచనున్నట్టు తెలిపారు. ఘటన జరిగి వారం గడిచినప్పటికీ బాధ్యులను అరెస్ట్ చేయడంలో ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నిందితులను రక్షించే చర్యకు ఆ సర్కారు పూనుకున్నట్టు అనుమానాలు కూడా వ్యక్తమ వుతున్నాయని పేర్కొన్నారు. యూపీ ప్రభుత్వ వైఖరిపై సుప్రీం కోర్టు కూడా తీవ్రంగా ఆక్షేపించిన విషయాన్ని గుర్తు చేశారు. లఖింపూర్ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ మౌనం వీడాలనీ, నూతన తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను, కార్మికకోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రాల్లో జరిగే కొవ్వొత్తుల ర్యాలీల్లో సీఐటీయూ అనుబంధ సం ఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.