Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 190 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు.శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు 42,166 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 36,166 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 5,750 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,871 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,288 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 58 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా ఏడు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో మూడు జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
12 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో గురువారంతో పోలిస్తే శుక్రవారం 12 జిల్లాల్లో కేసులు పెరిగాయి. కరీంనగర్, ఖమ్మం, మెదక్, మేడ్చల్ - మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, నిర్మల్, రంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కేసులు పెరిగాయి.
14 జిల్లాల్లో తగ్గిన కేసులు
జీహెచ్ఎంసీతో పాటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి.
నారాయణపేటలో నాలుగు రోజులుగా జీరో
నారాయణపేట జిల్లాలో నాలుగు రోజులుగా, వికారాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఒక్క కేసు నమోదు కాలేదు. జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కొమురంభీ ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో రెండు రోజులుగా కేసుల్లో ఎలాంటి మార్పు లేదు.