Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యావరణ పరిరక్షణ చర్యలు బాగున్నాయి
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నాకు నచ్చిన కార్యక్రమం : జగపతిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అడవుల పరిరక్షణ కోసం గ్రీన్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని సినీనటుడు జగపతిబాబు కొనియాడారు. పచ్చదనం పెంపునకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకునే వీలును గ్రీన్ ఫండ్ కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తనకు నచ్చిన కార్యక్రమమని అన్నారు. శనివారం దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో సింబా - ద ఫారెస్ట్ మ్యాన్ సినిమా షూటింగ్లో జగపతిబాబు పాల్గొన్నారు. జగపతిబాబు ఫారెస్టు ఆఫీసర్‌గా పలు సన్నివేశాలను చిత్రీకరించారు. మనకు బతుకునిచ్చే మొక్కను బతకనిద్దాం అనే నినాదంతో ఈ చిత్రం తెరకెక్కనున్నది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎం.పీ. జోగినపల్లి సంతోష్ కుమార్, డైరెక్టర్ సంపత్ నంది, ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ పీవీ. రాజారావు, నిర్మాతలు రాజేందర్ రెడ్డి, మురళీ మనోహర్ రెడ్డి, యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటి, హీరోయిన్ దివి వధ్వ, ప్రతి నాయకుడు కబీర్ దుహన్ సింగ్, చిత్ర యూనిట్‌తో కలిసి ఆయన మొక్కలు నాటారు.