Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరించిన రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై 12న మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ మోగించనుంది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని చెప్పారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్ దామోదర్ రాజానర్సింహ, కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్ తదితరులు ఉన్నారు.
ఉప ఎన్నిక కోసం స్టార్ క్యాంపెయినర్స్ : ఏఐసీసీ
హుజూరుబాద్ ఉప ఎన్నిక కోసం ఏఐసీసీ స్టార్ క్యాంపెయినర్స్‌ను నియమించింది. 20 మందితోకూడిన స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను ప్రకటించింది. గాంధీభవన్‌లో సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలు ఉపఎన్నిక వ్యూహంపై చర్చించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మండలానికో సమన్వయకర్త, ప్రతి గ్రామానికి ఒక ఇంచార్జీని నియమించారు. సమావేశానంతరం పార్టీనేతలు నూతి శ్రీకాంత్, మెట్టుసాయితో కలిసి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్ విలేకర్లతో మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం చర్చించామన్నారు. ఏడున్నరేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతుందన్నారు. బీజేపీ సర్కారు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదని విమర్శించారు. హుజూరాబాద్ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తారనే నమ్మకముందన్నారు.గిరిజన, మైనార్టీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానంచేసి సీఎం కేసీఆర్ చేతులుదులుపుకున్నారని విమర్శించారు. బీసీ జనగణనపై చేసిన తీర్మానం కూడా అలాంటిదేన్నారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్ మాట్లాడుతూ దళిత, గిరిజనులకు ఉపయోగపడే పలు సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ నీరు గారుస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రజల తిరుగుబాటు తత్వాన్ని ధ్వంసం చేసేందుకు విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతున్నారని ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి టీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. ంధీభవన్లో బతుకమ్మ సంబురాలు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సునీతారావు అధ్వర్యంలో శనివారం గాంధీభవన్‌లో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. వందలాది మహిళ బతుకమ్మ ఆడారు. టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్, సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు నిర్మల, నీలపద్మ తదితరులు పాల్గొన్నారు.