Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తాత్కాలిక పండ్ల మార్కెట్ నిర్వహణ కోసం స్థలాలను పరిశీలించనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వ నిర్ణయించిందని పేర్కొన్నారు. మార్కెట్‌ను బాటసింగారానికి తరలింపు విషయంలో పునరాలోచన చేయాలంటూ అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని హౌంమంత్రి నివాసంలో మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిబాయి, ఎంఐఎం ఎమ్మెల్యేలు జాఫర్‌హుస్సేన్, బలాలా సమావేశమయ్యారు. బాటసింగారంకు బదులుగా కొత్తపేట విక్టరీప్లే గ్రౌండ్ (వీఎంహౌం)లో కొనసాగించేందుకు పరిశీలించాలని ఎంఐఎం ఎమ్మెల్యేలు వినతిపత్రం సమర్పించారని మంత్రి పేర్కొన్నారు.
కొత్తపల్లి ఘటనపై సీఎం, మంత్రి దిగ్భ్రాంతి
జోగుళాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి గ్రామంలో గుడిసె కూలి నలుగురు మరణించడం పట్ల సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనపై సీఎం కేసీఆర్ మంత్రికి ఫోన్ చేసి ఆరా తీశారు. మృతులకు ఒక్కొక్కరికీ రూ 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మంత్రి ఆదేశించారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామనీ, ప్రభుత్వపరంగా విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.