Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి : టీపీటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాఠశాల విద్యాశాఖ సంచాలకులు అందుబాటులో లేకపోవడంతో మూడు నెలలుగా అనేక ఫైళ్లు పెండిం గ్లో ఉన్నాయని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడ రేషన్ (టీపీటీఎఫ్) తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యాశాఖ సంచాలకుల కార్యాలయంలో ఉపాధ్యా యుల సమస్యల పరిష్కారం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతుందని విమర్శించారు. ఇంగ్లీష్ మీడియం తరగతుల అప్‌గ్రెడేషన్‌కు సంబంధించిన ఫైళ్లను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని తెలిపారు. టీచర్ల వ్యక్తిగత సమస్యలైన లీవ్ సెటిల్మెంట్, క్లారిఫికేషన్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ ఫైళ్లను సకాలంలో సంబం ధిత అధికారులకు పంపడంలోనూ నెలల తరబడి జాప్యం జరుగుతున్న దని వివరించారు. కేజీబీవీల్లో గతేడాది ఫిబ్రవరిలో నియామకమైన పీజీసీఆర్టీ, సీఆర్టీలు, ఇతర సిబ్బంది వంద మందికి చెల్లించాల్సిన 20 నెలల జీతాలు ఏడాదికి పైగా ప్రాతినిధ్యం, ఆందోళన చేసినా కనీస స్పందన లేదన్నారు. సంచాలకులు అందుబాటులో లేకపోవడం వల్ల పరిష్కరించాల్సిన ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపారు.