Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సదానందంగౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని సర్కారు బడుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని ఎస్టీ యూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. రెండురోజులపాటు జరిగిన ఆ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో రెండు లక్షల మంది విద్యార్థులు కొత్తగా ప్రవేశం పొందారని వివరించారు. అయితే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా, విద్యావాలంటీర్లను నియమించకుండా విద్యాబోధన ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. ఆరేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యం సమస్య అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. సర్వీసు పర్సన్లను నియమించాలని కోరారు. ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా జి సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఎం పర్వత్‌రెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. అనంతరం ఎస్టీయూటీఎస్ రాష్ట్ర సమితి ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షులుగా జి సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఎం పర్వత్‌రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా బి రవి, అసోసియేట్ అధ్యక్షులుగా ఎవి సుధాకర్, వై కరుణాకర్‌రెడ్డి, అదనపు ప్రధాన కార్యదర్శులుగా ఈశ్వరయ్య, నారాయణస్వామి తదితరులు ఎన్నికయ్యారు.