Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆదూరి గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగా హీర్ వరుణ్ తేజ్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలోనే హైటెక్ సిటీ నోవాటెల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆదూరి గ్రూప్ చైర్మెన్ ఆదూరి రామాంజనేయులు మాట్లాడుతూ.. సామాన్యులకు అందుబాటు ధరలలో తాము ప్రారంభిస్తున్న కొత్త ప్రాజెక్టులు షాద్‌నగర్‌లోని ప్యారడైజ్-2, అమన్‌గల్‌లోని హైవే ప్యారడైజ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేలు గుర్కా జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, చేవెళ్ల శాసన సభ్యులు కాలే యాదయ్యలకు, ఆదూరి గ్రూప్ కుటుంబ సభ్యులకు, కస్టమర్లకు కృతజ్ఞతలు తెలియచేసారు. ఆదూరి గ్రూప్ ఎంతో నమ్మకంతో 25 వెంచర్లు పూర్తి చేసిందనీ, అభివృద్ధిలో వీరు చెప్పింది చెప్పినట్టుగా చేస్తారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. హైదరాబాదు చుట్టు ప్రక్కల శరవేగంతో పరుగులు తీస్తోందనీ, ఇక్కడ పెట్టుబడికి అదూరి గ్రూప్ వారి భరోసా కూడా తోడవుతుంది కాలే యాదయ్య అన్నారు. విచ్చేసిన అతిథులకు రామాంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు.