Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ఫొటో జర్నలిస్టు గ్రేటర్ హైదరాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో చేపట్టిన బతుకమ్మ ఫొటో కాంటెస్ట్ పోస్టర్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షు రాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం తన కార్యాలయంలో ఆవిష్క రించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పోటీలో ఫొటో జర్నలిస్టులతో పాటు నాన్-ఫొటో జర్నలిస్టులకు కూడా మీరు అవకాశం ఇవ్వడం అభినం దించదగ్గ విషయమని కొనియాడారు. యూనియన్‌కు తనతో పాటు ప్రభు త్వ సహకారం ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం యూనిట్ సభ్యులు ఎమ్మెల్సీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు ప్రెసిడెంట్ ఆనంద్ ధర్మాన, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీ వీరగోని రజనీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పోటీలో పాల్గొనేది ఇలా....
2021లో తీసిన ఫొటోలు మాత్రమే పంపాలి. ఫోటో జర్నలిస్టులకు ఎంట్రీ ఫీ లేదు. నాన్ ఫొటో జర్నలిస్టులకు ఎంట్రీ ఫీజు రూ.500. చెల్లించాలి. మొదటి బహుమతి రూ. 21,000, ద్వితీయ రూ. 15,000, తృతీయ బహుమతి రూ. 11,000. ఏడు కాన్సోలేషన్ బహుమతులు ఇస్తారు. వీటిలో ఒక్కొక్కరికి రూ. 7000 చొప్పున ఇవ్వబడును. మరిన్ని వివరాలకు యూనియన్ కార్యదర్శి వి.రజినీకాంత్ గౌడ్ 8096677013ను సంప్రదించవచ్చు.