Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పోడు సాగుదార్లందరికీ వెంటనే హక్కుపత్రాలి వ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ (ఎంఎల్) న్యూడె మోక్రసీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2005, డిసెంబర్ 13 వరకు సాగులోని రైతులందరికీ హక్కుల పత్రాలిచ్చే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 2014, జూన్ 2 వరకు గడువును పొడిగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని సూచించారు. అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం గ్రామసభలకు దరఖాస్తులు చేసుకోవాలని ఉందని వివరించారు. కానీ సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేలకు, అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడమంటే, రాజకీయ జోక్యానికీ, అవినీతికీ, అలసత్వానికీ ఆస్కారిస్తుందని విమర్శించారు.